Canada Jobs For Indians: విదేశాల్లో ఉద్యోగం చేయడం మీ లక్ష్యమా.. అయితే ఈ అవకాశాలు మీ కోసమే.. లక్షల్లో ఖాళీలు..

|

Sep 04, 2022 | 5:08 PM

ప్రతి ఒక్కరికి విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఆశ, లక్ష్యం ఉంటుంది. కేవలం ఇంజినీర్లకు మాత్రమే విదేశాల్లో ఎక్కువ అవకాశాలుంటాయని చాలామంది అనుకుంటారు. కాని కేవలం ఇంజినీర్లు లేదా ప్రొఫెషనల్ ఉద్యోగాలే కాకుండా వివిధ రంగాలకు సంబంధించి..

Canada Jobs For Indians: విదేశాల్లో ఉద్యోగం చేయడం మీ లక్ష్యమా.. అయితే ఈ అవకాశాలు మీ కోసమే.. లక్షల్లో ఖాళీలు..
Jobs In Canada
Follow us on

Canada Jobs For Indians: ప్రతి ఒక్కరికి విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఆశ, లక్ష్యం ఉంటుంది. కేవలం ఇంజినీర్లకు మాత్రమే విదేశాల్లో ఎక్కువ అవకాశాలుంటాయని చాలామంది అనుకుంటారు. కాని కేవలం ఇంజినీర్లు లేదా ప్రొఫెషనల్ ఉద్యోగాలే కాకుండా వివిధ రంగాలకు సంబంధించి అనేక ఉద్యోగాలు విదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఉద్యోగాల ఖాళీలను తెలుసుకునే విధానం తెలియక చాలామంది తమ లక్ష్యం నుంచి వెనుకడుగు వేస్తారు. కాని విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారికి కెనడాలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లాలనుకునేవారు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎక్కువ ఖాళీలు ఉంటాయని.. ఆదేశాలకు వెళ్తుంటారు. అలాగే కెనడాలో కూడా ఇటీవల కాలంలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కెనడాలో ప్రస్తుతం వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎంప్లాయిస్ కోసం ఆదేశం ఎదురుచేస్తోంది. ఆ దేశంలో జాబ్​ వేకెన్సీ లిస్ట్.. నెల నెలా పెరుగుతూ పోతోంది. తాజాగా.. జూన్​కు సంబంధించిన కెనడా జాబ్​ వేకెన్సీ డేటా విడుదలైంది. జూన్​ నెలలో అది 3.2శాతం పెరిగింది. మే నెలతో పోలిస్తే కెనడాలో ఉద్యోగ ఖాళీలు 32,200 పెరిగాయి.

కెనడాలో అక్కడి ప్రజల అవసరాలకు తగ్గట్టు మ్యాన్​పవర్​ లేకపోవడంతో విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయులకు ఇది ఓ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. జూన్​ నెలకు కెనడాలో జాబ్​ వేకెన్సీ రేటు 5.9శాతానికి పెరిగింది. గతేడాది ఇదే జూన్​తో పోల్చుకుంటే.. ఇది 1శాతం ఎక్కువ అనే చెప్పుకోవాలి. ఏయే రంగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలుసుకుందాం.

హెల్త్​ కేర్, సోషల్​ అసిస్టెన్స్​ రంగాల్లో అధికంగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గతేడాది జూన్​తో పోల్చుకుంటే.. ఈ రంగంలో జాబ్​ వేకెన్సీ 40.8శాతం పెరిగింది. మొత్తం మీద ఈ రంగంలో 1,49,700 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అలాగే ఏకామిడేషన్, ఫుడ్ సెక్టార్ రంగంలో 1.71.700 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. రీటైల్ ట్రేడ్ రంగంలో ఈ ఏడాది మేతో పోల్చుకుంటే జూన్​లో 15,200 ఖాళీలు పెరిగాయి. అంటే.. ఈ రంగంలో 15.3శాతం ఉద్యోగ అవకాశాలు ఉండగా.. ఈ రంగంలో 1,14,400 జాబ్​ వేకెన్సీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఒక్క జూన్ నెలలోనే కెనాడాలో ఉద్యగ ఖాళీల జాబితా చూసుకున్నట్లయితే నిర్మాణ రంగంలో 89,200, తయారీ రంగంలో 82,800 ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెషనల్​, సైన్స్​, టెక్నికల్​ సర్వీసెస్ రంగాల్లో 72,200 ఉద్యోగ ఖాళీలు ఉండగా.. రవాణా, వేర్​హౌజింగ్ రంగాల్లో 49,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఫైనాన్స్​ అండ్​ బీమా రంగంలో 41,200 జాబ్​ వేకెన్సీలు ఉన్నాయి. కెనడా తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం అక్కడ ప్రతి ఉద్యోగానికి కేవలం ఒక నిరుద్యోగ వ్యక్తి మాత్రమే ఉన్నారు. దీంతో మ్యాన్ పవర్ లేక చాలా ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. ఉద్యోగాల ఖాళీలు విపరీతంగా ఉండటంతో.. ఇమ్మిగ్రేషన్​పై కెనడా ఆశలు పెట్టుకుంది. తమ దేశంలోకి వచ్చే వారికి పర్మినెంట్ రెసిడెంట్ (PR)​ ఇస్తామంటోంది. 2022-2024 మధ్యలో 4,30,000- నుంచి 4,50,000 పీఆర్​లు ఆమోదిస్తామని కెనడా ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.