Bolarum APS Recruitment 2023: తెలంగాణ టీచర్‌ జాబ్స్.. బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో 63 పీజీటీ, టీజీటీ ఉపాధ్యాయ ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి..

|

Dec 29, 2022 | 9:54 PM

సికింద్రాబాద్‌లోని బొల్లారంలోనున్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ 2023-24 విద్యాసంవత్సరానికి.. రెగ్యులర్/ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 63 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమరీ టీచర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

Bolarum APS Recruitment 2023: తెలంగాణ టీచర్‌ జాబ్స్.. బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో 63 పీజీటీ, టీజీటీ ఉపాధ్యాయ ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి..
Bolarum Army Public School
Follow us on

సికింద్రాబాద్‌లోని బొల్లారంలోనున్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ 2023-24 విద్యాసంవత్సరానికి.. రెగ్యులర్/ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 63 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమరీ టీచర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, హోమ్ సైన్స్, సైకాలజీ, పెయింటింగ్/ ఫైన్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, డ్యాన్స్, హిందీ, సంస్కృతం తదితర సబ్జెక్టుల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈఎల్‌ఈడీ, డీఈఎల్‌ఈడీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సీటెట్‌/టెట్‌ అర్హత సాధించి ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో జనవరి 30, 2023లోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా లేదా నేరుగా అయినా సమర్పించవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. నిబంధన ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.