BOB Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్‌ ఆఫ్ బరోడాలో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

|

Nov 23, 2021 | 10:07 PM

BOB Recruitment 2021: బ్యాంక్‌లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది. రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టుల కోసం

BOB Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్‌ ఆఫ్ బరోడాలో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..
Bob Job 2021
Follow us on

BOB Recruitment 2021: బ్యాంక్‌లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది. రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం 376 పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ని సందర్శించాలి. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ మోడ్‌లో ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియ 19 నవంబర్ 2021 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 9 డిసెంబర్ 2021 అని గుర్తుంచుకోండి.

ఖాళీ వివరాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 376 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ కోసం 326 సీట్లు, వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ కోసం 50 సీట్లు కేటాయించారు. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 92 సీట్లను కేటాయించారు. 101 సీట్లు ఓబీసీకి, 47 సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వారికి అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, 44 ఎస్సీ కేటగిరీకి, 42 ఎస్టీ కేటగిరీకి కేటాయించారు. ఖాళీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.

ఇలా దరఖాస్తు చేసుకోండి
1. దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా రిక్రూట్‌మెంట్ పోర్టల్ bankofbaroda.inకి వెళ్లండి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో జాబ్స్‌పై క్లిక్ చేయండి.
3. కాంట్రాక్ట్ ప్రాతిపదికన E-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ ఎంపికకు వెళ్లండి.
4. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
5. తర్వాత ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.

దరఖాస్తు రుసుము
నోటిఫికేషన్ ప్రకారం.. జనరల్, OBC, ఆర్థికంగా బలహీన (EWS) కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.600 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా sc-st కేటగిరీ అభ్యర్థులు రూ.100, PH కేటగిరీ అభ్యర్థులు రూ.100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుమును డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ తనిఖీ చేస్తే సరిపోతుంది. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 9 డిసెంబర్ 2021.

Short Nails: మీ చేతికున్న చిన్న గోళ్లని పొడవుగా చూపించాలనుకుంటున్నారా..! ఈ టిప్స్‌ పాటించండి..

Weight Loss: డైటింగ్ చేయకుండా బరువు తగ్గవచ్చు..! ఈ 4 సులభమైన మార్గాలు తెలుసుకోండి..

Cricket News: 10 ఓవర్లలో10 పరుగులు మాత్రమే.. 50 పరుగులకే జట్టు మొత్తం ఆలౌట్‌..?