AP Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లితాలను అధికారులు శనివారం విడుదల చేశారు. ఈ పరీక్షలను సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు బోర్డు నిర్వహించింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 2 వరకు ఆన్సర్ పేపర్‌ల రీకౌంటింగ్, రీవాల్యువేషన్ అవకాశం కల్పించారు.
రీకౌంటింగ్ చేసుకోవాలనుకునే వారు పేపర్‌కు రూ.260, స్కాన్ కాపీ, రీవాల్యువేషన్ కోసం పేపర్‌కు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కానింగ్ జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లోనే అందిస్తారు. ఇక షార్ట్ మెమోలను ఈ నెల 25న సాయంత్రం ఐదు గంటల నుంచి bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* అభ్యర్థులు ముందుగా https://results.apcfss.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం ఏ ఇయర్ ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయాలి.
* తర్వాత హాల్ టికెట్ నెంబర్‌తో పాటు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ నొక్కితే ఫలితాలు వచ్చేస్తాయి.
Also Read: PM Modi: వ్యాక్సిన్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోడీ సమావేశం.. ఈ అంశాలపై సంచలన నిర్ణయం..
TDP Leader Pattabhi: పట్టాభికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు లైవ్ వీడియో
ప్రధాని నరేంద్ర మోదీ బంపర్ ఆఫర్..! దీపావళికి ముందు ఆ నియోజకవర్గానికి 5229 కోట్ల కేటాయింపు..