BITSAT 2026 Registration: బిట్‌శాట్‌ 2026 ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే

ప్రముఖ విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌)లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్‌ సైన్స్ అడ్మిషన్ టెస్ట్‌ (బిట్‌శాట్‌)-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బిట్‌శాట్-2026కు స్కోర్ ఆధారంగా హైదరాబాద్‌ క్యాంపస్‌, పిలానీ క్యాంపస్‌, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో.. ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు..

BITSAT 2026 Registration: బిట్‌శాట్‌ 2026 ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే
BITSAT 2026 Session 1 registration

Updated on: Dec 16, 2025 | 8:13 AM

రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌)లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్‌ సైన్స్ అడ్మిషన్ టెస్ట్‌ (బిట్‌శాట్‌)-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బిట్‌శాట్-2026కు స్కోర్ ఆధారంగా హైదరాబాద్‌ క్యాంపస్‌, పిలానీ క్యాంపస్‌, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో.. ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు అందిస్తున్నారు. బిట్‌శాట్‌-2026 టెస్టు మొత్తం రెండు సెషన్లలో జరుగుతుంది. అభ్యర్థులు రెండు సెషన్లు రాయవచ్చు. రెండింటిలో బెస్ట్ స్కోరునే అంతిమంగా పరిగణనలోకి తీసుకుంటారు.

బీఈ, ఎంఎస్సీ, బీఫార్మ్ డిగ్రీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు బిట్స్ పిలానీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ, మెల్‌బోర్న్, అయోవా స్టేట్ యూనివర్సిటీ, ఏమ్స్, యూఎస్‌ఏ; యూనివర్సిటీ ఎట్ బఫెలో, న్యూయార్క్, యూఎస్‌ఏ; రెన్సెలార్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్, న్యూయార్క్, యూఎస్‌ఏ; సెంట్రల్ సుపెర్లాక్ పారిస్, ఫ్రాన్స్ వంటి ప్రఖ్యాత వర్సిటీల్లో 2+2 జాయింట్ కొలాబరేటివ్ ప్రోగ్రామ్‌లకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 2+2 జాయింట్-కొలాబరేటివ్ ప్రోగ్రామ్‌లలో విద్యార్థులు మొదటి రెండేళ్లు భారత్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో చదవటానికి అనుమతి ఉంటుంది. అనంతరం మిగిలిన రెండేళ్లు తాము ఎంచుకున్న విదేశీ యూనివర్సిటీలో చదవవచ్చు.

బిట్‌సాట్‌ (BITSAT) అందించే ఇంటిగ్రేటెడ్ ఫస్ట్‌ డిగ్రీ కోర్సుల వివరాలు ఇవే..

  • బిట్స్‌ పిలానీ- పిలానీ క్యాంపస్‌లో.. బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్ అండ్‌ కంప్యూటింగ్, ఎన్విరాన్మెంటల్‌ అండ్‌ సస్టెయినబుల్‌ ఇంజినీరింగ్‌. బీఫార్మసీ, ఎంఎస్సీ బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్‌, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సెమికండక్టర్‌ అండ్‌ నానోసైన్స్‌ కోర్సులు, ఎంఎస్సీ జనరల్ స్టడీస్ కోర్సు అందిస్తారు.
  • బిట్స్‌ పిలానీ- కేకే బిర్లా గోవా క్యాంపస్‌లో బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ అండ్‌ కంప్యూటింగ్, ఎన్విరాన్మెంటల్‌ అండ్‌ సస్టెయినబుల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు, ఎంఎస్సీ బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సెమికండక్టర్‌ అండ్‌ నానోసైన్స్‌ కోర్సులు అందిస్తుంది.
  • బిట్స్ పిలానీ – హైదరాబాద్ క్యాంపస్‌లో బీఈ కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ అండ్‌ కంప్యూటింగ్, ఎన్విరాన్మెంటల్‌ అండ్‌ సస్టెయినబుల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు, బీఫార్మసీ, ఎంఎస్సీలో బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సెమికండక్టర్‌ అండ్‌ నానోసైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హతలు.

బిట్స్‌ పిలానీలో ప్రవేశాలు పొందేందుకు అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్టులతో 75 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. బిట్‌శాట్‌-2026 టెస్టులో వచ్చిన మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెషన్‌-1 దరఖాస్తులు డిసెంబర్‌ 15 నుంచి మార్చి 16, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద సెషన్ 1, 2 పరీక్షలకు రూ.5400 చెల్లించాలి. మహిళా అభ్యర్ధులు రూ.4400 చొప్పున చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • బిట్‌శాట్‌ 2026 సెషన్‌-1 దరఖాస్తులు ప్రారంభ తేదీ: డిసెంబర్ 15, 2026.
  • బిట్‌శాట్‌ 2026 సెషన్‌-1 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 16, 2026.
  • బిట్‌శాట్‌ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-1 పరీక్ష తేదీ: ఏప్రిల్ 15 నుంచి 17 వరకు.
  • బిట్‌శాట్‌ 2026 సెషన్‌ 2 దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 20, 2026.
  • బిట్‌శాట్‌ 2026 సెషన్‌-1 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 2, 2026.
  • బిట్‌శాట్‌ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్ 2 పరీక్ష తేదీ: మే 24 నుంచి 26 వరకు

బిట్‌శాట్‌-2026 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.