Bureau of Indian Standards Young Professional Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (BIS).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ (Young Professional Posts) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఖాళీల వివరాలు:
వయోపరిమితి: జూన్ 1, 2022 నాటికి 35 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీఈ/ బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ (మెటలర్జికల్ ఇంజినీరింగ్)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.