AI Era: యువతకు బిల్‌గేట్స్‌ సక్సెస్‌ మంత్ర.. ‘ఏఐ టూల్స్‌ నేర్చుకుంటే భవిష్యత్తు మీదే’

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కృత్రిమ మేధస్సు (AI) వేగవంతమైన పురోగతిపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రపంచ శ్రామిక శక్తి, సమాజంపై AI లోతైన ప్రభావాలపై తన దృక్పథాన్ని ఇటీవల పంచుకున్నారు. ఉత్పాదకతను గణనీయంగా పెంచగల శక్తివంతమైన శక్తిగా AI-ఆధారిత ఆటోమేషన్‌ను గేట్స్ సూచించారు. ఇది మరింత అర్థవంతమైన, సృజనాత్మక పని తీరుపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. అయితే ఈ పరివర్తన వేగం గురించి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ఇది సమాజం ప్రస్తుత సామర్థ్యాన్ని అధిగమించగలదు. ఇది అధికంగా ఉద్యోగ తొలగింపులకు, ఆర్థిక సవాళ్లకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు..

AI Era: యువతకు బిల్‌గేట్స్‌ సక్సెస్‌ మంత్ర.. ఏఐ టూల్స్‌ నేర్చుకుంటే భవిష్యత్తు మీదే
Bill Gates on AI era

Edited By: TV9 Telugu

Updated on: Oct 15, 2025 | 12:20 PM

ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI)తో ఉద్యోగాలు ఊడిపోతాయనే భయం ప్రతి ఒక్కరినీ వేదిస్తుంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీల్లో వరుస లేఆఫ్‌లు కలవరపెడుతున్నాయి. అయితే ఏఐతో కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పలువురు నిపుణులు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు. దీనిపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఏఐ ఆటోమేషన్‌తో సానుకూలత సాధ్యమేనని, పనిని మరింత నైపుణ్యంతో చేయడానికి ఉపకరిస్తుందని అంటున్నారు. అయితే ఈ మార్పు వేగంగా సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏఐ కారణంగా మునుముందు రోజుల్లో వైట్-కాలర్ ఉద్యోగాలు నిరుపయోగంగా మారతాయని, ఇది బ్లూ-కాలర్ ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. మరోవైపు 2023 నాటికి దాదాపు 50 శాతం వైట్‌ కాలర్‌, ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఇప్పటికే ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఏఐలో అమెరికాను గ్లోబర్‌ లీడర్‌గా మార్చడానికి సిలికాన్ వ్యాలీ ఫ్రెండ్లీ ప్లాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బిల్‌గేట్స్‌ తాజాగా ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. AI ఉత్పాదకతను కేవలం ఆర్థిక ఉత్పత్తి పరంగా చూడకూడదని ప్రజలు తమ రోజువారీ దినచర్య పనుల నుంచి విముక్తి పొందేందుకు కూడా వినియోగించుకోవచ్చని బిల్ గేట్స్ చెబుతున్నారు. మిగతా వాటితో పోల్చుకుంటే ప్రధానంగా మూడు రంగాల్లో మాత్రం ఏఐ ఆటోమేషన్‌ ముప్పు కాస్త తక్కువగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. కోడింగ్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్, బయాలజీ రంగాలు ఏఐని తట్టుకొని నిలబడతాయని గతంలో గేట్స్ చెప్పారు.

ఏఐ వేగవంతమైన అభివృద్ధి తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందని, ముఖ్యంగా దీని డీప్ రీసెర్చ్ వంటి కొత్త సమస్య పరిష్కార సామర్థ్యాలను ఆయన వెల్లడించారు. ‘నాకు ఫిజిక్స్‌లో ఏదైనా కన్‌ఫ్యూజన్‌ తలెత్తితే వెంటనే నా వద్ద ఉన్న నిపుణులకు కాల్‌ చేసి పరిష్కరిస్తాను. కానీ ఏఐ పంపిన సమాధానాలను వారికి పంపితే వారు ఇకపై మా అవసరం నీకు లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని’ అన్నారు. వెనుకబడిన దేశాల్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ నైపుణ్యాల కోసం ఏఐ టూల్స్‌ వస్తున్నాయని, తాము ఓపెన్‌ ఏఐతో కలిసి పనిచేస్తున్నట్లు బిల్ గేట్స్ తెలిపారు. ఏఐ టూల్స్‌ ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో మార్పులు తీసుకొస్తాయని, ఈ చొరవ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన దేశాలు అభివృద్ధి అంతరాలను తగ్గించడానికి AI శక్తిని ఉపయోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఏఐ యుగంలో యువత ఎదుర్కొంటున్న ఉపాధి సమస్యలపై గేట్స్‌ మాట్లాడుతూ.. సాధికారత, వృద్ధికి సాధనంగా AIని స్వీకరించాలని యువతకు సూచించారు. ఏఐని స్వీకరించడం, ట్రాక్‌ చేయడం చాలా ముఖ్యమన్నారు. తద్వారా ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం అంతగా ఉండదని సూచించారు. వీటిని తెలివిగా ఉపయోగిస్తే కృత్రిమ మేధ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుందని ఆయన గేట్స్ సూచించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.