BHEL Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! బీహెచ్‌ఈఎల్‌లో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు..

|

Jun 08, 2022 | 7:03 PM

భారత ప్రభుత్వానికి చెందిన నాగ్‌పుర్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL)కు చెందిన సెక్టర్ వెస్టర్న్‌ రీజియన్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల (Engineer posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

BHEL Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! బీహెచ్‌ఈఎల్‌లో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు..
Bhel
Follow us on

BHEL Nogpur Engineer and Supervisor Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన నాగ్‌పుర్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL)కు చెందిన సెక్టర్ వెస్టర్న్‌ రీజియన్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల (Engineer posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 8

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులు

వయోపరిమితి: జూన్‌ 1 నాటికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్ధులకు సడలింపు ఉంటుంది.

పే స్కేల్‌: గంటకు రూ.43,550ల నుంచి రూ.78000ల వరకు చెల్లిస్తారు.

అర్హతలు:

  • ఇంజనీర్ పోస్టులకు సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
  • సూపర్‌వైజర్ పోస్టులకు సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: Sr. Deputy General Manager (HR)
BHEL, Power Sector Western Region,
Shree Mohini Complex, 345 Kingsway, Nagpur – 440001.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 21, 2022.

ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.