BEL Recruitment: బెల్‌ హైదరాబాద్‌ యూనిట్‌లో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్ చేసిన వారు అర్హులు.. ఇలా అప్లై చేసుకోండి..

|

Dec 28, 2021 | 9:35 AM

BEL Recruitment 2021: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో (బెల్‌) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా హైదరాబాద్‌ యూనిట్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో..

BEL Recruitment: బెల్‌ హైదరాబాద్‌ యూనిట్‌లో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్ చేసిన వారు అర్హులు.. ఇలా అప్లై చేసుకోండి..
Follow us on

BEL Recruitment 2021: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో (బెల్‌) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా హైదరాబాద్‌ యూనిట్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ట్రైనీ ఇంజనీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* మొత్తం ఖాళీల్లో ట్రైనీ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్)-19, ట్రైనీ ఇంజనీర్(మెకానికల్)-11, ట్రైనీ ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్)-03, ప్రాజెక్ట్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్)-36, ప్రాజెక్ట్ ఇంజనీర్(మెకానికల్)-08, ప్రాజెక్ట్ ఇంజనీర్(కంప్యూటర్ సైన్స్)-06, ప్రాజెక్ట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-01 పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

* ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 31-12-2021 నాటికి 25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్‌ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను జనరల్ మేనేజర్ (HR), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, I.E.నాచారం, హైదరాబాద్- 500076, తెలంగాణ అడ్రస్‌కు పంపించాలి.

* ట్రైనీ ఇంజనీర్‌ అభ్యర్థులు మొదట ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత అవసరం దృష్ట్యా గరిష్టంగా మూడేళ్ల వరకు పొడగిస్తారు.

* ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ అభ్యర్థులు రెండు సంవత్సరాల వ్యవధి వరకు పని చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా నాలుగు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.

* అభ్యర్థుల స్వీకరణకు చివరి తేదీగా డిసెంబర్‌ 31, 2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Anand Mahindra: ఆనంద్‌ మహీంద్రను కదిలించిన వీడియో.. జీవితాన్ని గెలిచిన దివ్యాంగుడికి ఉద్యోగం కల్పిస్తూ నిర్ణయం..

ONGC Recruitment: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

British Queen: జలియన్‌వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ ను చంపడానికి హైటెక్ ప్రయత్నం.. నిందితుడి అరెస్ట్!