BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ బెంగళూరులోని కార్యాలయంలో పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ కంపెనీ సెక్రెటరీ(ఏసీఎస్), అసిన్టెంట్ మేనేజర్(లీగల్) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ(ఎల్ఎల్‌బీ/బీఎల్), ఐసీఎస్ఐలో సభ్యత్వం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను డిప్యూటీ మేనేజర్, భార్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, అవుటర్ రింగ్ రోడ్, బెంగళూరు, 560045 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000 నుంచి రూ. 1,60,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తు చేసుకునే ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
* దరఖాస్తుల స్వీకరణ 05-02-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Gmailలో ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఉపయోగించారా.. ఇందులో నుంచి సీక్రెట్ ఇమెయిల్ పంపవచ్చు తెలుసా..
Health Benefits of Desi Ghee: దేశీ ఆవు నెయ్యి ఎందుకు తినాలో.. లాభాలు ఏంటో తెలుసుకోండి..
PM Modi Review Meeting: కోవిడ్ వ్యాప్తి, నివారణా చర్యలపై సీఎంలతో ప్రధాని వర్చువల్ సమావేశం..