బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన 25 ప్రాజెక్ట్ ఇంజినీర్-I, ట్రైనీ ఇంజనీర్-I పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్/ఈ అండ్ టీ/టెలీకమ్యునికేషన్ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు నవంబర్ 1, 2022వ తేదీ నాటికి 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 29, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయలో పోస్టును బట్టి రూ.150ల నుంచి రూ.400ల వరకు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.30,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Deputy Manager (HR/Military Communications SBU), Bharat Electronics Limited, Jalahalli Post, Bengaluru – 560013.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.