BECIL Recruitment: ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

|

Oct 14, 2022 | 8:36 AM

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ/ఎన్‌సీఆర్/ ఝజ్జర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీను భర్తీ చేయనున్నారు. ఔట్‌సోర్స్‌ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

BECIL Recruitment: ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
BECIL-AIIMS Recruitment 2022
Follow us on

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ/ఎన్‌సీఆర్/ ఝజ్జర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీను భర్తీ చేయనున్నారు. ఔట్‌సోర్స్‌ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఎంటీఎస్‌(ఫిమేల్‌) (10), ల్యాబ్ టెక్నీషియన్ (02), ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ (03) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా మెట్రిక్యులేషన్, 10+2, డిప్లొమా, బీఎస్సీ, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంటీఎస్‌ పోస్టులకు ఎంపికైన వారిని నెలకు రూ.16,614, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు రూ.21,970, ఓటీఏ పోస్టులకు రూ.20,202 జీతంగా చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 27-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..