BECIL Recruitment: ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎలా ఎంపిక చేస్తారంటే.

|

Apr 02, 2023 | 4:04 PM

ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్త బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా డిఈఓ, రేడియో గ్రాఫర్, పేషెంట్ కేర్ మేనేజర్ వంటి పోస్టులను భర్తీ..

BECIL Recruitment: ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎలా ఎంపిక చేస్తారంటే.
Becil Jobs
Follow us on

ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్త బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా డిఈఓ, రేడియో గ్రాఫర్, పేషెంట్ కేర్ మేనేజర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 155 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 155 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (50), పేషెంట్ మేనేజర్‌ (10), పేషెంట్‌ కోఆర్డినేటర్‌ (25), రేడియో గ్రాఫర్‌ (50), మెడికల్ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్‌ (20) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్‌ పూర్తి చేసి ఉండాలి. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

* పేషంట్‌ కేర్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు. ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు రూ. 885 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు రూ. 531 చెల్లించాలి.

* దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 12వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..