BECIL Recruitment: బీఈసీఐఎల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణకు రేపే చివరి తేదీ.

|

Aug 21, 2021 | 6:55 PM

BECIL Recruitment 2021: న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌).. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఏఐఐఏ)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

BECIL Recruitment: బీఈసీఐఎల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణకు రేపే చివరి తేదీ.
Becil
Follow us on

BECIL Recruitment 2021: న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌).. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఏఐఐఏ)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో బాగంగా మొత్తం 162 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (ఆగస్టు 22) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 162 ఖాళీలకు గాను సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, రీసెర్చ్‌ అసోసియేట్, రీసెర్చ్‌ కోఆర్డినేటర్, సైంటిస్ట్, బయో మెడికల్‌ ఇంజనీర్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌(పీఆర్‌ఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి.
* అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు వివిధ పోస్టుల ఆధారంగా నెలకు రూ.15,492 నుంచి రూ.1,23,100 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 22తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: IAS, IPSల సెల్ఫ్ డబ్బా ఎక్కువైంది.. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతాలు బ్యాన్ చేయాలని బీజేపీ ఎంపీ

Revanth Reddy: చంద్రబాబు, కేసీఆర్, వైఎస్సార్ అక్కడి నుంచే ఎదిగారు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Realme C21Y: భారత మార్కెట్లోకి రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్‌.. ధర రూ. 10వేల లోపే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.