పూణె ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో పని చేయడానికి.. 225 స్పెషలిస్ట్ ఆఫీసర్ గ్రేడ్ 2 & 3 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు దారుల వయసు 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 6, 2023లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారు రూ.1180లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి చెందిన వారు రూ.118లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు స్కేల్-3 పోస్టులకైతే రూ.63,840ల నుంచి రూ.78,230ల వరకు జీతంగా చెల్లిస్తారు. స్కేల్ 2 పోస్టులకు రూ.48,170ల నుంచి రూ.69,810ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.