AYUSH Recruitment: ఆయుష్‌ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

|

Nov 14, 2021 | 6:37 PM

AYUSH Recruitment 2021: ఆయుష్‌ మంత్రిత్వశాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభగాల్లో ఖాళీలు...

AYUSH Recruitment: ఆయుష్‌ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Ayush Recruitment
Follow us on

AYUSH Recruitment 2021: ఆయుష్‌ మంత్రిత్వశాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభగాల్లో ఖాళీలు ఉన్నాయి.? అర్హతలు ఏంటి.? అన్న వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రోగ్రాం మేనేజర్లు (03), డేటా అనలిస్ట్‌/ డేటా ఏంట్రీ ఆపరేటర్‌ (02) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ప్రోగ్రాం మేనేజర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తో పాటు ఎంబీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* డేటా అనలిస్ట్‌/ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌తో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌, టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ పూర్తి వివరాలను డ్రగ్‌ పాలసీ సెక్షన్‌, మినిస్టరీ ఆఫ్‌ ఆయుష్‌, ఎన్‌బీసీసీ, ఆఫీస్‌ బ్లాక్‌ 3, న్యూఢిల్లీ, 110023 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* ప్రోగ్రాం మేనేజర్‌ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 50,000, డేటా అనలిస్ట్‌/డేటా ఎంట్రీ ఆపరేట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 20,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 25-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Minister Harishrao: ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్‌కు వెళ్లిన మంత్రి హరీష్ రావు.. తృటిలో తప్పిన ప్రమాదం..!

Mobile Data Plans: 1జీబీ డేటా రూ.38,000.. ఎక్కడో తెలుసా? నివేదికలో నమ్మలేని నిజాలు..!

Kerala Heavy Rains: కేరళకు రెడ్ అలెర్ట్… 48 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు..