ASRB-NET 2023: అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపికైతే రూ.1,77,500ల జీతం..

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) దేశ వ్యాప్తంగా ఉన్న పలు కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో 195 సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ (ఎస్‌ఎంఎస్‌)..

ASRB-NET 2023: అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపికైతే రూ.1,77,500ల జీతం..
ASRB Combined Notification 2023
Follow us
Srilakshmi C

|

Updated on: May 23, 2023 | 1:13 PM

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) దేశ వ్యాప్తంగా ఉన్న పలు కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో 195 సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ (ఎస్‌ఎంఎస్‌), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఎస్‌టీవో) పోస్టుల భర్తీతో పాటు జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)-2023 నిర్వహణకు ఉమ్మడి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎంటమాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, ఎకనామిక్ బోటనీ అండ్‌ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, జెనెటిక్స్ అండ్‌ ప్లాంట్ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ, అనిమల్‌ బయోటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్‌, వెటర్నరీ సైన్స్‌ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు ఏప్రిల్‌ 10, 2023 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నెట్‌ పరీక్షకైతే 21 ఏళ్లు నిండి ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఏప్రిల్‌ 10, 2023వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో నెట్‌ పరీక్షకు జనరల్‌ అభ్యర్ధులు రూ.1000లు, ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులు రూ.250 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్‌ఎంఎస్‌ పోస్టులకు జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..