Army Public School Teaching Recruitment 2022: దేశ వ్యాప్తంగా ఉన్న పలు కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్) టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, పీజీ, డీఈఎల్‌ఈడీ, బీఈఎల్‌ఈడీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితోపాటు సీటెట్, టెట్‌లో కూడా అర్హత సాధించి ఉండాలి. ఫ్రెషర్స్, అనుభవమున్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్‌కు 40 యేళ్లు, అనుభవమున్న వారికి 57 యేళ్లలోపు వయసున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 5వ తేదీలోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ నైపుణ్యలు ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష నవంబర్ 6, 2022వ తేదీన జరుగుతుంది. అదేనెల 20న ఫలితాలు విడుదలవుతాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.