Army NCC Special Entry Jobs: ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ ఉన్న అవివాహిత మహిళా/పురుషులకు ఆర్మీ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Jan 19, 2023 | 1:47 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియ‌న్ ఆర్మీ.. 55 షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత మహిళా/పురుష ఎన్‌సీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

Army NCC Special Entry Jobs: ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ ఉన్న అవివాహిత మహిళా/పురుషులకు ఆర్మీ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Indian Army[1]
Follow us on

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియ‌న్ ఆర్మీ.. 55 షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత మహిళా/పురుష ఎన్‌సీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో పురుషులకు 50 పోస్టులు, మహిళలకు 5 వరకు పోస్టులను కేటాయించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ/యుద్ధ ప్రమాదాల్లో గాయ‌ప‌డ్డ ఆర్మీ సిబ్బందికి క‌నీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం చదువుతున్న వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అలాగే ఎన్‌సీసీ ‘సీ’ స‌ర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. యుద్ధ ప్రమాదాల్లో గాయ‌ప‌డ్డ వారికి ఎన్‌సీసీ ‌సీ స‌ర్టిఫికెట్ ఉండాల్సిన అవ‌స‌రం లేదు. అభ్యర్ధుల వయసు జులై 1, 2023వ తేదీ నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఫిబ్రవరి 15, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, స్టేజ్‌-1/స్టేజ్‌-2 రాత పరీక్ష, ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఆధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.