ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (ఎస్‌వోఈ/ సీవీఈ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 8వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) నోటిఫికేషన్ విడుదల చేసింది. గిరిజన బాలబాలికలకు మాత్రమే ఈ గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు మార్చి 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తారు. అలాగే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇంటర్ ఎంపీలో 300 సీట్లు; ఇంటర్ బైపీసీలో 300 సీట్లు; 8వ తరగతిలో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలో 2023-24 విద్యా సంవత్సరానికి ఏడో తరగతి ఉత్తీర్ణులై విద్యార్థులు 8వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించరాదు. 8వ తరగతి ప్రవేశ పరీక్ష, ఇంటర్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షను మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలకు ఉంటుంది. ఏడో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. తెలుగు సబ్జెక్ట్ నుంచి 10 మార్కులు, ఇంగ్లిష్ సబ్జెక్ట్ నుంచి 10 మార్కులు, హిందీ సబ్జెక్ట్ నుంచి 10 మార్కులు, మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి 20 మార్కులు, ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి 15 మార్కులు, బయోసైన్స్ సబ్జెక్ట్ నుంచి 15 మార్కులు, సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుంచి 20 మార్కులు వస్తాయి. ఇంటర్ ప్రవేశ పరీక్షకు పదో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్ నుంచి 20 మార్కులు, మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి 40 మార్కులు, ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి 20 మార్కులు, బయోసైన్స్ సబ్జెక్ట్ నుంచి 20 మార్కులు సబ్జెక్టు వస్తాయి.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.