APRJC CET 2023: ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

|

Apr 17, 2023 | 2:50 PM

ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్‌ (ఇంగ్లిష్/హిందీ మీడియం) ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌జేసీ సెట్‌ (మైనార్టీ)-2023 ఎంట్రన్స్‌ టెస్ట్‌కు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్‌..

APRJC CET 2023: ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు
APRJC CET 2023
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్‌ (ఇంగ్లిష్/హిందీ మీడియం) ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌జేసీ సెట్‌ (మైనార్టీ)-2023 ఎంట్రన్స్‌ టెస్ట్‌కు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో బాలురు, బాలికలకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (మైనార్టీ)-2023 ద్వారా మొత్తం 345 సీట్ల (గుంటూరు: 115, కర్నూలు:115, అన్నమయ్య జిల్లా:115)కు ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హతలు..

ప్రస్తుత విద్యా సంవత్సరం (2022-23)లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు లేదా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు జూన్‌ 7, 2023వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మే 15 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తులకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం (మొదటి జాబితా): మే 15, 2023.
  • దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 7, 2023.
  • ఎంపిక జాబితా వెల్లడి (మొదటి): జూన్ 8, 2023.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం (రెండో జాబితా): జూన్‌ 10, 2023.
  • దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 19, 2023
  • ఎంపిక జాబితా వెల్లడి (రెండవది): జూన్‌ 20, 2023.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం (మూడో జాబితా): జూన్‌ 22, 2023
  • దరఖాస్తుకు చివరి తేదీ: 28.06.2023
  • ఎంపిక జాబితా వెల్లడి (మూడోది): జూన్‌ 30, 2023.
  • ప్రవేశాల ముగింపు: జూన్‌ 30, 2023

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.