APRJC 2022 exam date: మే 20తో ముగియనున్న ఏపీఆర్‌జేసీ 2022 దరఖాస్తు గడువు.. వెంటనే..

|

May 17, 2022 | 7:24 PM

ఏపీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌జేసీ 2022 (APRJC 2022) ప్రవేశ పరీక్షకు మే 20లోపు దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్‌ సోమదత్త..

APRJC 2022 exam date: మే 20తో ముగియనున్న ఏపీఆర్‌జేసీ 2022 దరఖాస్తు గడువు.. వెంటనే..
Aprjc 2022
Follow us on

APRJC 2022 Registration Deadline: ఏపీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌జేసీ 2022 (APRJC 2022) ప్రవేశ పరీక్షకు మే 20లోపు దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్‌ సోమదత్త తెలిపారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు రుసుము చెల్లించిన తర్వాత వచ్చే గుర్తింపు సంఖ్యతో దరఖాస్తు పూర్తి చేయాలని సూచించారు. కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినంత మాత్రాన దరఖాస్తు సమర్పించినట్లు కాదని, ఇప్పటి వరకు దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు వ్యక్తిగత వివరాలలో మార్పులు చేసుకునేందుకు మే 18, 19 తేదీల్లో అవకాశం కల్పించామని తెలిపారు.

కాగా 2022-23 విద్యాసంవత్సరానికి గానూ ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ఇంటర్‌, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ (APREI) ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 28 న ప్రారంభమైంది. చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో చివరితేదీ వరకు ఎదురుచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచనలు జారీ చేసింది. జూన్‌ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష జరగనుంది. ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.