APPSC Recruitment : 730 ఏపీపీఎస్సీ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పొడిగింపు.. ఎలా అప్లై చేయాలంటే..

|

Jan 19, 2022 | 6:01 AM

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన జూనియర్ అసిస్టెంట్‌తో సహా పలు పోస్టుల కోసం దరఖాస్తు గడువు తేదీని ఏపీపీఎస్సీ పొడిగించింది . అభ్యర్థులు జనవరి 29

APPSC Recruitment : 730 ఏపీపీఎస్సీ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పొడిగింపు.. ఎలా అప్లై చేయాలంటే..
Follow us on

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన జూనియర్ అసిస్టెంట్‌తో సహా పలు పోస్టుల కోసం దరఖాస్తు గడువు తేదీని ఏపీపీఎస్సీ పొడిగించింది . అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫీజు చెల్లింపునకు జనవరి 28 తుది గడువుగా ఇచ్చారు. మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నేటి( జనవరి 19) తో ఈ గడువు ముగియనుండాలి. అయితే అభ్యర్థుల సౌకర్యార్థం దరఖాస్తు గడువును పెంచింది.   ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా  రెవెన్యూ శాఖలోని  670 జూనియర్ అసిస్టెంట్-కమ్-కంప్యూటర్ అసిస్టెంట్ ,  దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ఈ పోస్టుల  గతేడాది డిసెంబర్ 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

ఎవరు అర్హులంటే..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  గ్రాడ్యుయేషన్ డిగ్రీని  పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి వయస్సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. SC, ST కేటగిరీ అభ్యర్థులకు 5  ఏళ్ల సడలింపు  ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన  మరింత సమాచారం కోసం అభ్యర్థులుఅధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

ఎంపిక ప్రక్రియ

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్,  మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత పొందుతారు.

దరఖాస్తు విధానం..

*దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్    ఓపెన్ చేయాలి.

*వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఉన్న  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.

* APPSC రిక్రూట్‌మెంట్ 2022లో 700+ ఎగ్జిక్యూటివ్ & కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల కోసం, ఆన్‌లైన్‌లో అప్లై చేసే లింక్‌కి వెళ్లాలి.

*ఇప్పుడు అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

*ఆ తర్వాత అడిగిన వివరాలను పూరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను  పూర్తి చేయాలి.

*రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని  భద్రపర్చుకోవాలి.

Also Read: Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్ లో పేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు..

Viral: నక్షత్రమండలం నుంచి భూమిని చేరిని అరుదైన ‘నలుపు’ వజ్రం.. త్వరలోనే వేలం!

Budget 2022: బడ్జెట్‌కు ముందు ఈ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టండి.. అధిక రాబడికి అందించే ఛాన్స్..!