APPSC AEE Recruitment 2022: ఏపీ బీటెక్ నిరుద్యోగులకు అలర్ట్‌! ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 23 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

APPSC AEE Recruitment 2022: ఏపీ బీటెక్ నిరుద్యోగులకు అలర్ట్‌! ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
APPSC AEE Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 30, 2022 | 8:46 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 23 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జులై 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 14, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 26, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.370లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపులు నవంబర్‌ 14వ తేదీలోపు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష మొత్తం 3 పేపర్లకు నిర్వహిస్తారు. మొదటి పేపర్‌లో జనవర్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ, రెండో పేపర్‌ సివిల్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌, పేపర్ 3లో సివిల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఒక్కొపేపర్‌కు 150 మార్కుల చొప్పున 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 150 నిముషాల వ్యవధిలో పరీక్షలు రాయవల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం 450 మార్కులకు పరీక్షలు ఉంటాయి.

ఖాళీల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- సివిల్ (ఏపీ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజినీరింగ్ సర్వీస్‌) పోస్టులు: 13
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- సివిల్ (ఏపీ రోడ్స్ & బిల్డింగ్స్ ఇంజినీరింగ్ సర్వీస్‌) పోస్టులు: 3
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- సివిల్ (ఏపీ వాటర్ రిసోర్సెస్ సర్వీస్‌) పోస్టులు: 4
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- మెకానికల్ (ఏపీ వాటర్ రిసోర్సెస్ సర్వీస్‌) పోస్టులు: 1
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- సివిల్ (ఏపీ పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ సర్వీస్‌) పోస్టులు: 2

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!