విజయవాడ, డిసెంబర్ 24: ఏపీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. జనవరి 29 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ వరుస ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రకటనలు ఇవ్వగా.. తాజాగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 99 ఖాళీలను భర్తీ చేయనుంది. జనవరి 29 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి వివరాలు ఇక్కడ చూడండి..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేమ మొత్తం ఖాళీలు: 99
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత బ్రాంచిలో డిగ్రీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 29, 2024 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 18, 2024తో ఆన్‌లైన్ దరఖాస్తు తుది గడువు ముగుస్తుంది. ఏప్రిల్/ మే, 2024లో రాత పరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.98,400 వరకు జీతంగా చెల్లిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.