APPSC Group 2: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్ధులకు అలర్ట్‌.. నేటితో ముగుస్తున్న కీ అభ్యంతరాల గడువు!

రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించిన గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. మొత్తం అభ్యర్ధుల్లో 92 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. తాజాగా ఈ పరీక్షకు సంబంధించి కమిషన్‌ అప్‌డేట్‌ జారీ చేసింది..

APPSC Group 2: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్ధులకు అలర్ట్‌.. నేటితో ముగుస్తున్న కీ అభ్యంతరాల గడువు!
APPSC Group 2

Updated on: Feb 28, 2025 | 7:00 AM

అమరావతి, ఫిబ్రవరి 27: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌ 2 అభ్యర్ధులకు కమిషన్‌ కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఫిబ్రవరి 23వ తేదీ (ఆదివారం) నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఆన్సర్‌ కీ అదే రోజు విడుదలయ్యాయి. వీటిపై అభ్యంతరాల స్వీకరణ గడువు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఫిబ్రవరి 27వ తేదీతో ముగిసింది. తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఏపీపీఎస్సీ ప్రటకన జారీ చేసింది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు గడువు సమయాన్ని పొడిగించింది.

గ్రూప్‌ 2 మెయిన్స్‌ పేపర్‌ 1, 2 పరీక్షల ప్రాథమిక ‘కీ’లపై ఈ మేరకు శుక్రవారం గుడువు సమయంలో ముగింపులోగా అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కమిషన్‌ స్పష్టం చేసింది. అభ్యంతరాల్ని కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే స్వీకరిస్తామని, ఆఫ్‌లైన్‌, ఈమెయిల్‌ ద్వారా వచ్చేవాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని ఏపీపీఎస్సీ పేర్కొంది. కాగా గ్రూప్ 2 పేపర్‌ 1, 2 పరీక్షల ఏ, బీ, సీ, డీ సీరీస్‌ల ప్రశ్నపత్రాలతోపాటు ఆన్సర్ కీలను, అభ్యర్ధుల రెస్పాన్స్ షీట్లను కూడిన కీ ని ఏపీపీఎస్సీ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ ఆన్సర్ కీల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ జీడీ తుది ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌, రైఫిల్‌మ్యాన్‌ జీడీ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షల తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) తాజాగా విడుదల చేసింది. ఇటీవల నిర్వహించిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌కు సంబంధించిన ఎంపికైన వారి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థుల ఫలితాలు మార్చి 13వ తేదీ వరకు మాత్రమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ లోపు అభ్యర్ధులు తమ ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది. కాగా ఆన్‌లైన్‌ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి 25 మధ్య తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ జీడీ తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.