APPSC Interview Dates: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్‌.. 259 మంది ఎంపిక

|

Jul 23, 2023 | 12:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌1 సర్వీస్‌ నియామకాలకు సంబంధించి చివరి దశ అయిన ఇంటర్వ్యూ తేదీలు విడుదలయ్యాయి. ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ..

APPSC Interview Dates: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్‌.. 259 మంది ఎంపిక
APPSC Group 1
Follow us on

విజయవాడ, జులై 23: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌1 సర్వీస్‌ నియామకాలకు సంబంధించి చివరి దశ అయిన ఇంటర్వ్యూ తేదీలు విడుదలయ్యాయి. ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 11 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయి. మధ్యలో ఆగస్టు 5, 6 తేదీల్లో ఇంటర్వ్యూ ఉండదు. ఈ మేరకు తేదీల వారీగా ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తూ ప్రకటన వెలువరించింది. రోజుకు 30 మంది అభ్యర్థుల చొప్పున ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. చివరి రోజు 10 మందికి మాత్రమే ఇంటర్వ్యూలు ఉంటాయి.

విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో రోజుకు 2 షిఫ్టుల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఇంటర్వ్యూతోపాటు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. మొత్తం 111 గ్రూప్‌1 పోస్టులకు 259 మంది అభ్యర్ధులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో స్పోర్ట్స్‌ కేటగిరీ నుంచి 39 మంది ఎంపికయ్యారు. జూన్‌లో మెయిన్స్‌ నిర్వహించగా జులై 14న మెయిన్స్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

తేదీల వారీగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన అభ్యర్థుల వివరాల కోసం క్లిక్‌ చేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.