APPSC Notification 2023: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..3,220 పోస్టులకు ఎపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల! నేటి నుంచే దరఖాస్తులు

|

Oct 31, 2023 | 8:33 AM

ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు మరో శుభవార్త.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అనుమతి ఇచ్చిన సర్కార్ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 యూనివర్సిటీల్లో మొత్తం 3,220 అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు భర్తీ చేయనున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

APPSC Notification 2023: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..3,220 పోస్టులకు ఎపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల! నేటి నుంచే దరఖాస్తులు
APPSC Assistant Professor Recruitment
Follow us on

అమరావతి, అక్టోబర్‌ 31: ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు మరో శుభవార్త.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అనుమతి ఇచ్చిన సర్కార్ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 యూనివర్సిటీల్లో మొత్తం 3,220 అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు భర్తీ చేయనున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలని యూనివర్సిటీల చరిత్రలోనే 17 ఏళ్ల తర్వాత ఇంత భారీ మొత్తంలో రిక్రూట్మెంట్ జరుగుతుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

మొత్తం పోస్టుల్లో 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్ ప్రొఫెసర్, 2001 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఉన్నత విద్యా మండలి ‘ఉమ్మడి పోర్టల్‌’ ద్వారా ఈ రోజు (అక్టోబర్ 31) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. అభ్యర్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు మాత్రం ఒకే దరఖాస్తు ఫీజుతో అన్ని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. గతంలో అయితే ప్రతి యూనివర్సిటీకి ఒక్కో దరఖాస్తు పెట్టుకోవాల్సి వచ్చేది.. వాటికి వేరువేరుగా ఫీజుగా రూ.వేలు చెల్లించాల్సి వచ్చేంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ద్వారా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి పారదర్శకంగా ఎంపికలు చేపట్టనుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి గరిష్టంగా 10 మార్కుల వెయిటేజ్ ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

దరఖాస్తు రుసుము ఎంతంటే..

  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఓపెన్‌ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు: రూ.2,500
  • ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు (పర్సన్‌ బెంచ్‌ మార్క్‌ విత్‌ డిజేబిలిటీ) అభ్యర్థులు: రూ.2 వేలు
  • ప్రవాస భారతీయులు : 50 డాలర్లు/రూ.4.200

ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు

  • అన్ని కేటగిరీల అభ్యర్థులు: రూ.3 వేల
  • ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్‌ పోస్టులు: రూ.150 డాలర్లు/రూ.12,600
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 100 డాలర్లు/రూ.8,400

ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో ఈ రోజు నుంచి నవంబర్‌ 20, 2023వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని పోస్టు ద్వారా నవంబర్‌ 27, 2023వ తేదీలోపు పంపించాలి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలు నవంబర్‌ 30, 2023న విడుదల చేస్తారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్ట్‌ స్క్రీనింగ్‌ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా డిసెంబర్‌ 8, 2023వ తేదీన వెలువరిస్తారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.