AP EAPCET 2023: ఏపీలో నేటి నుంచి EAPCET పరీక్షలు.. ఈ నిబంధనలు తప్పనిసరి అంటోన్న అధికారులు.

|

May 15, 2023 | 7:29 AM

ఏపీలో నేటి (సోమవారం) నుంచి 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు ఈఏపీసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభంకానుంది. మొదట ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు మే 15 నుంచి 19 వరకు జరుగనున్నాయి. అనంతరం...

AP EAPCET 2023: ఏపీలో నేటి నుంచి EAPCET పరీక్షలు.. ఈ నిబంధనలు తప్పనిసరి అంటోన్న అధికారులు.
Ap Eapcet 2023
Follow us on

ఏపీలో నేటి (సోమవారం) నుంచి 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు ఈఏపీసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభంకానుంది. మొదట ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు మే 15 నుంచి 19 వరకు జరుగనున్నాయి. అనంతరం అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్ష నిర్వంచనున్నారు.

పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని ఏపీ ఈఏపీసెట్‌ ఛైర్మన్, అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ ఛాన్సిలర్‌ ఆచార్య రంగజనార్దన పేర్కొన్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. 7.30 నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇక సెకండ్‌ మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఈ పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రానికి అనుతమిస్తారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 129, తెలంగాణలో 7 కేంద్రాల్లో.. 3 లక్షల 40 వేల మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

ఈ నిబంధనలు తప్పనిసరి..

* పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ఫొటో ఐడెంటిటీ కోసం ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకురావాలి.

ఇవి కూడా చదవండి

* చేతులకు గోరింటాకు పెట్టుకున్న విద్యార్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

* ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రోజే కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

* హాల్‌ టికెట్‌లో పొరపాట్లు ఉంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా సహాయకేంద్రానికి లేదా మెయిల్‌ పంపి సరిచేసుకోవచ్చు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..