AP Anganwadi Jobs 2023: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలో 123 అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.. 7వ/పదో తరగతి పాసైతే చాలు

|

May 19, 2023 | 9:49 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కింద శ్రీకాకుళం జిల్లా అంగన్‌వాడీ కేంద్రాల్లో 123 అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

AP Anganwadi Jobs 2023: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలో 123 అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.. 7వ/పదో తరగతి పాసైతే చాలు
Andhra Pradesh
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కింద శ్రీకాకుళం జిల్లా అంగన్‌వాడీ కేంద్రాల్లో 123 అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక గ్రామానికి చెందిన వివాహితులైన మహిళలు మాత్రమే అర్హులు. పోస్టును బట్టి తప్పనిసరిగా ఏడో తరగతి, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు దారుల వయసు జులై 1, 2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు మే 25, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయం (సీడీపీవో)లో నేరుగాగానీ లేదా పోస్టు ద్వారాగానీ అందజేయవచ్చు. అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులకు టెన్త్‌లో వచ్చిన మార్కులు, వయసు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆంగన్‌వాడీ సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు ఏడో తరగతి పాసై ఉండాలి. అలాగే గ్రామ స్థానికత, మున్సిపాలిటీ పరిధిలో వార్డు స్థానికతల ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు నెలకు రూ.11,500లు, మినీ అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు నెలకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు నెలకు రూ.7000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.