అమరావతి, జులై 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. జులై 4 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ కీలక ప్రకటన వెలువరించింది. టెట్ పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తామని ప్రకటించింది. ఏపీ టెట్- జులై 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అర్హత కలిగిన అభ్యర్ధులు జులై 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు గడువు ముగిసేలోపు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మైనార్టీ అభ్యర్ధులకు సూచించింది.
ఇంటర్, డీఎడ్, డిగ్రీ, బీఎడ్ ఉత్తీర్ణత కలిగి ఉండటంతో ఏపీ టెట్ – జులై 2024కు దరఖాస్తు చేసుకుని ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైనారిటీలు అంటే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే డైరెక్టర్ కార్యాలయం, మైనారిటీల విద్యాభివృద్ధి కేంద్రం, స్వాతి థియేటర్ ఎదురుగా, భవానీపురం, విజయవాడ లేదా కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంలోని సంబంధిత ప్రాంతీయ కేంద్రాలలో ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా జులై 10, 2024వ తేదీని నిర్ణయించారు.
ఏపీ టెట్ 2024 మైనార్టీ అభ్యర్ధుల ఉచిత కోచింగ్ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో 8,773 జూనియర్ అసోసియేట్(క్లర్క్) పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియకు నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జూన్ 9న మెయిన్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది. హైదరాబాద్ సర్కిల్‌లో 525 పోస్టులు, అమరావతి సర్కిల్‌లో 50 పోస్టులు ఉన్నాయి.
ఎస్‌బీఐ క్లర్క్ తుది ఫలితాల మార్కుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.