AP TET 2022: నేటి నుంచి ప్రారంభమైన ఏపీ టెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ

|

Jun 16, 2022 | 11:32 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022 (AP TET August 2022)కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్..

AP TET 2022: నేటి నుంచి ప్రారంభమైన ఏపీ టెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ
Ap Tet 2022
Follow us on

AP TET 2022 Application Last Date: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022 (AP TET August 2022)కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో జులై 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రూ.500ల దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022 నోటిఫికేషన్‌ జూన్‌ 10 విడుదలైన సంగతి తెలిసిందే. ఈ యేడాది టెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 6 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. పేప‌ర్‌ 1, పేపర్‌ 2 పరీక్షలను బ‌ట్టి ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్స్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/బీఈడీ/లాంగ్వేజ్ పండిట్‌/యూజీడీపీఈడీ/డీపీఈడీ/బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారితోపాటు, 2020-22 విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివే విద్యార్ధులు కూడా దరఖాస్తు చుసుకోవచ్చు. ఈ సారి టెట్‌ పరీక్షకు ఇతర రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలు కేటాయిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల ముందుగా దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్రంలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించే అవకాశం ఉంది. చివరి నిముషం వరకు వేచిచూడకుండా ముందే దరఖాస్తు చేసుకుంటే బెటర్‌!

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 16, 2022.
  • దరఖాస్తులకు చివరి తేదీ: జులై 16, 2022.
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: జులై 25 నుంచి
  • పరీక్షల నిర్వహణ: ఆగస్టు 6 నుంచి 21 వరకు జరుగుతాయి.
  • ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల: ఆగస్టు 31, 2022.
  • అభ్యంతరాలు లేవనెత్తడానికి గడువు: సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు, 2022.
  • ఫైనల్ ఆన్సర్‌ ‘కీ’ విడుదల: సెప్టెంబర్‌ 12, 2022.
  • ఏపీ టెట్‌ 2022 ఫలితాల విడుదల తేదీ: సెప్టెంబర్‌ 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.