AP SSC Supply Exams: ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ-2022 హాల్‌ టికెట్లు విడుదల

|

Jun 30, 2022 | 3:53 PM

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి..

AP SSC Supply Exams: ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ-2022 హాల్‌ టికెట్లు విడుదల
Ap Ssc Exams
Follow us on

AP Tenth Supplementary Exams 2022: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. జులై 6 నుంచి 15 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిముషాల వరకు పరీక్షలు నిర్వహిస్తారని దేవానందరెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు నిర్వహించే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఏపీ ప్రభుత్వం ఫీజు మినహాయింపు ఇచ్చింది. దీంతో ఈ ఏడాది దాదాపు 2 లక్షలకు పైగా ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు ఉచితంగా జారీ అయ్యాయి.

కాగా జూన్ 6న విడుదలైన పదో తరగతి పరీక్షల్లో 4,14,281 మంది విద్యార్థులు (హాజరైన విద్యార్ధులు 6,21,799ల మంది) ఉత్తీర్ణత సాధించారు. అంటే కేవలం 67.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2,01,627ల మంది విద్యార్ధులు ఫెయిలయ్యారు. వీరందరికీ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జులై 6 నుంచి జరుగుతాయి. గత రెండేళ్లగా పరీక్షలు నిర్వహించని ఏపీ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు ఈ ఏడాది నిర్వహించిన పరీక్షల్లో గ్రేడులకు బదులు మార్కుల రూపంలో ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.