AP SSC Exams: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. పదో తరగతిలో ఆ విద్యార్ధులకు 10 మార్కులు వచ్చినా పాసైనట్లే

|

Oct 31, 2024 | 11:07 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్ధుల ఉత్తీర్ణత మార్కులపై కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 35 మార్కులు వస్తేనే పాసైనట్లు ప్రకటించే పదో తరగతి పరీక్షల బోర్డు ఇకపై 10 శాతం మార్కులు తెచ్చుకున్నా చాలు.. పాసైనట్లేనని ప్రకటించింది. అయితే ఈ వెసులుబాటు కేవలం..

AP SSC Exams: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. పదో తరగతిలో ఆ విద్యార్ధులకు 10 మార్కులు వచ్చినా పాసైనట్లే
SSC Exams
Follow us on

అమరావతి, అక్టోబర్‌ 31: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది జరగనున్న పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ పరీక్షలు రాసే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉండే మినహాయింపులను ప్రస్తావిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. మెంటల్‌ రిటార్డేషన్‌ స్థానంలో మేథో వైకల్యంగా పేరు మార్చింది. అంతేకాకుండా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణత మార్కులు 35కు బదులుగా 10 మార్కులుగా మారుస్తూ ప్రకటన జారీ చేసింది. అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టులో పది మార్కులు వస్తే చాలు.. వారిని ఉత్తీర్ణులుగా టెన్త్‌ క్లాస్ బోర్డు పరిగణిస్తుందని పేర్కొంది.

తెలంగాణ ఎల్‌ఎల్‌ఎం చివరి విడత కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు పూర్తి

తెలంగాణ ఎల్‌ఎల్‌ఎం చివరి విడత కౌన్సెలింగ్‌ సీట్లను బుధవారం కేటాయించినట్లు లాసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి రమేశ్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ న్యాయ కళాశాలల్లో 272 సీట్లు అందుబాటులో ఉండగా.. వీటికోసం దాదాపు 1,406 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్‌లో అన్నీ సీట్లు భర్తీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు ఆయా కాలేజీల్లో నవంబరు 1 నుంచి 5వ తేదీలోపు ఫీజు చెల్లించి, రిపోర్ట్‌ చేయాలని సూచించారు.

6 వేల మందికి శిక్షణ ఇచ్చేలా స్కిల్స్‌ యూనివర్సిటీజజ వచ్చే నెల 6న పనుల ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన హంగులతో ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పలు నమూనాలను సర్కారు తయారు చేయించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట సమీపంలో దాదాపు 57 ఎకరాల విస్తీర్ణంలోని యూనివర్సిటీ స్థలంలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌తోపాటు.. అకడమిక్‌ బ్లాక్, వర్క్‌ షాప్‌లు, బాలికలు, బాలురకు వేర్వేరుగా వసతి గృహాలు, డైనింగ్‌ హాల్, స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. వీటితోపాటు క్యాంపస్లో ఆడిటోరియం, లైబ్రరీ, సువిశాల మైదానం, పార్కింగ్‌ ఏరియా కూడా ఉండేలా డిజైన్లు రూపొందించారు. వర్సిటీ ప్రాంగణంలో ఎక్కువ ఖాళీ స్థలం, పచ్చదనం ఉండేలా నమూనాలు తయారు చేయించారు. ఇందులో యేటా ఆరు వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, వసతి సదుపాయాలు ఉండేలా క్యాంపస్‌లో నిర్మాణాలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.