AP RGUKT IIIT 2nd Phase counselling: ఏపీ ట్రిపుల్‌ ఐటీ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం.. రిజిస్ట్రేషన్లకు రేపే ఆఖరు

|

Jul 29, 2024 | 2:39 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఆర్‌కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు రెందో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలివిడత కౌన్సెలింగ్‌లో మొత్తం 4,140 మంది విద్యార్థులు పాల్గొనగా.. వీరిలో 3,396 మంది విద్యార్ధులకు సీట్లు కేటాయించారు. ఇందులో మిగిలిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు..

AP RGUKT IIIT 2nd Phase counselling: ఏపీ ట్రిపుల్‌ ఐటీ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం.. రిజిస్ట్రేషన్లకు రేపే ఆఖరు
AP RGUKT IIIT
Follow us on

అమరావతి, జులై 29: ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఆర్‌కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు రెందో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలివిడత కౌన్సెలింగ్‌లో మొత్తం 4,140 మంది విద్యార్థులు పాల్గొనగా.. వీరిలో 3,396 మంది విద్యార్ధులకు సీట్లు కేటాయించారు. ఇందులో మిగిలిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌ హాజరుకావల్సిన వివరాలను ఆగస్టు 3వ తేదీన ప్రకటిస్తామని ఆర్జీయూకేటీ సెట్‌ అడ్మిషన్‌ కన్వీనర్‌ ఎస్‌ అమరేంద్రకుమార్‌ తెలిపారు.

ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో రెండో విడత కౌన్సెలింగ్‌కు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జులై 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది. అలాగే మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు క్యాంపస్ మార్పునకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే మొదటి విడతలో సీట్లు పొంది, రిపోర్టు చేయని విద్యార్థులు కూడా జులై 30 లోగా రెండో విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఏపీ ఆర్జీయూకేటీ రెండో విడత కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌కు ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

సీయూఈటీ యూజీ 2024 ఫలితాలు విడుదల

యూనివర్సిటీల ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీయూఈటీ-యూజీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జులై 7న విడుదల చేసిన సీయూఈటీ – యూజీ కీపై వచ్చిన అభ్యంతరాలతో 1,000 మందికి జులై 19వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 13.4 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

సీయూఈటీ యూజీ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.