AP PGCET 2024 Halltickets: ఏపీ పీజీసెట్ 2024 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఏపీ పీజీసెట్)కు సంబంధించిన హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి విడుదల..
విశాఖపట్నం, జూన్ 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఏపీ పీజీసెట్)కు సంబంధించిన హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ పీజీసెట్ 2024 హాల్‌టికెట్ కోసం క్లిక్ చేయండి.
ఈ ఏడాది పీజీసెట్ ప్రవేశ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. పీజీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా మొత్తం 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ పరీక్షను ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నారు.
ఎంపీఈడీ మినహా మిగతా అందరికీ రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీల్లో అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులకు కేటాయిస్తారు. పీజీసెట్ మూడు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్నారు. మొత్తం 3 కేటగిరీలకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. కేటగిరీ-1 పరీక్షలో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ కోర్సులు ఉంటాయి. కేటగిరీ-2 పరీక్షలో కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ కోర్సు ఉంటుంది. కేటగిరీ-3 పరీక్షలో సైన్స్ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.