AP Model Schools: ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఉద్యోగాలు.. 282 టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం..!

AP Model Schools: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి...

AP Model Schools: ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఉద్యోగాలు.. 282 టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం..!

Edited By:

Updated on: Dec 11, 2021 | 6:36 AM

AP Model Schools: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఏపీలోని ఆదర్శ పాఠశాలల్లో 282 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ కానున్నాయి. ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 282 పోస్టుల్లో 211 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు, 71 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అయితే మోడల్‌ స్కూల్‌లలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా పని చేస్తున్న పార్ట్‌టైమ్‌ టీచర్లకు ఇందులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కేంద్ర సర్కార్‌ పథకం ద్వారా 2009లో మోడల్‌ స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 355 స్కూళ్లు ఏర్పాటు కాగా, విభజన అనంతరం ఏపీకి 165 స్కూళ్లను కేటాయించారు.

జోన్‌ల వారీగా ఖాళీలు..
జోన్‌ 1లో 50 పోస్టులు, జోన్‌ 2లో 4 పోస్టులు, జోన్‌ 3లో 73 పోస్టులు, జోన్‌ 4లో 155 పోస్టులున్నాయి.

ఇవి కూడా చదవండి:

Omicron: ఒమిక్రాన్ భయాలు.. పరీక్షల నిర్వహణపై కల్‌కత్తా యూనివర్సిటీ కీలక నిర్ణయం

SBI Bank Jobs: ఎస్బీఐలో 1226 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నేటి నుంచే రిజిస్ట్రేషన్‌.. పూర్తి వివరాలివే..