High Court: ‘పోలీసుశాఖలో ఖాళీల భర్తీ విషయంపై అఫిడవిట్‌ వేయండి’ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

|

Oct 17, 2024 | 4:07 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. పోలీసు ఉద్యోగాల భర్తీల విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది..

High Court: పోలీసుశాఖలో ఖాళీల భర్తీ విషయంపై అఫిడవిట్‌ వేయండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
High Court
Follow us on

అమరావతి, అక్టోబర్‌ 17: ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖలో ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ అఫిడవిట్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు, సాయుధ దళాలపై పని ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం యేటా ఖాళీలను భర్తీ చేస్తుండాలని, ఆ ప్రక్రియను పర్యవేక్షిస్తుండాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించిందన్న విషయాన్ని గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హెల్ప్‌ ది పీపుల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కీతినీడి అఖిల్‌ శ్రీగురుతేజ హైకోర్టులో పిల్‌ వేశారు. దానిని బుధవారం విచారించిన హైకోర్టు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరింది.

నవంబర్‌ 18న ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్‌-2 పరీక్ష.. వెబ్‌సైట్‌లో టైర్‌ 1 పరీక్ష ఫైనల్‌ కీ

వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 3,712 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామినేషన్‌ 2024 (టైర్‌-1) పరీక్ష ఫైనల్‌ ఆన్సర్‌ కీ విడుదలైంది. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) అధికారిక ప్రకటన జారీ చేసింది. టైర్‌ 1లో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నవంబర్‌ 18న సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్‌-2 పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింద. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. ఇక టైర్‌ 1 పరీక్షలు జులైలో నిర్వహించిన విషయం తెలిసిందే.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్‌-1 ఫైనల్‌ కీ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు.. ఎప్పటి వరకంటే

డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ వర్సిటీలో డిగ్రీ, పీజీల్లో ప్రవేశాలు పొందడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీని అక్టోబరు 30 వరకు పొడిగించినట్లు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ఇ సుధారాణి ఓ ప్రకటనలో తెలిపారు. 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో డిగ్రీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ రుసుం చెల్లించాలని తెలిపారు. అంతకుముందు చేరిన విద్యార్థులు సైతం అక్టోబరు 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించవచ్చు. లేదంటే 7382929570/580, 040-23680222/333/444/555 లేదా టోల్‌ ఫ్రీ 18005990101ను సంప్రదించవచ్చు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో పరిశీలించాలన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.