AP EdCET 2024 Results: ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

|

Jun 27, 2024 | 3:15 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2024 ఫలితాలు గురువారం (జూన్‌ 27) విడుదలయ్యాయి. ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఈ మేరకు ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

AP EdCET 2024 Results: ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
AP EdCET 2024 Results
Follow us on

అమరావతి, జూన్‌ 27: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2024 ఫలితాలు గురువారం (జూన్‌ 27) విడుదలయ్యాయి. ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఈ మేరకు ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది ఎడ్‌ సెట్‌ ప్రవేశ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్‌ 8వ తేదీన ఎడ్‌సెట్‌ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఏపీ ఎడ్‌సెట్‌ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ ఎడ్‌సెట్‌ 2024 ర్యాంకు కార్డు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

 ఏపీ గురుకులాల్లో రద్దైన 1,500 సీట్ల పునరుద్ధరణ: మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ సర్కార్‌ రద్దు చేసిన సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మంజూరైన 1,500 సీట్లను తిరిగి పునరుద్ధరించనున్నట్టు సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కార్యచరణ ప్రారంభమైంది. ఏఏ గురుకులాల్లో ఏ విభాగంలో ఎన్ని సీట్లు రద్దు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై అధికారులను ఆదేశించినట్టు మంత్రి వీరాంజనేయస్వామి వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో జూన్‌ 26న మంత్రిగా బాధ్యతలు స్వీ్కరించిన ఆయన… ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్‌లో పలు కోర్సుల్లో సీట్లను పెంచారు. సీఈసీ విభాగంలో 80 సీట్లు, ఎంపీసీలో 40 సీట్లు, బైపీసీలో 40 సీట్ల చొప్పున అదనంగా మంజూరు చేస్తూ ఆయన తొలి సంతకం చేశారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్త కథనాల కోసం క్లిక్‌ చేయండి.