AP EAPCET 2024 Hall Ticket: ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. మే 16 నుంచి పరీక్షలు

|

May 07, 2024 | 1:51 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఈఏపీసెట్‌)కు సంంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదల అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి హాల్‌ టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు..

AP EAPCET 2024 Hall Ticket: ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. మే 16 నుంచి పరీక్షలు
AP EAPCET 2024 Hall Ticket
Follow us on

అమరావతి, మే 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఈఏపీసెట్‌)కు సంంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదల అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి హాల్‌ టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్లో నమోదు చేసి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్‌ 2024 హాల్‌టికెట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా గతేడాది కంటే ఈ ఏడాది ఈఏపీసెట్‌ దరఖాస్తులు భారీగా అందాయి. ఇప్పటి వరకూ దాదాపు 3.60 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. రూ.5000 ఆలస్య రుసుంతో మే 10వ తేదీ వరకు, రూ.10 వేల ఆలస్య రుసుంతో మే 12 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మే 16, 17 తేదీల్లో అగ్రిక‌ల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్షలు జరుగనుండగా.. మే 18 నుంచి 23వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్‌ ప్రొఫెషనల్‌ కాలేజీల్లో.. బీఈ, బీటెక్‌, అగ్రిక‌ల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ 2024 పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహిస్తోంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.