AP EAPCET 2024 Postponed: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ 2024 పరీక్ష తేదీల్లో మార్పు..! కారణం ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈఏపీసెట్‌) 2024 పరీక్షకు మార్చి 12 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏపీఈఏపీసెట్‌ పరీక్షలు మే 13 నుంచి మే 19వ వరకు నిర్వహించనున్నట్లు తొలుత ప్రకటించిన నోటిఫికేషన్‌లో జేఎన్‌టీయూ కాకినాడ పేర్కొంది..

AP EAPCET 2024 Postponed: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ 2024 పరీక్ష తేదీల్లో మార్పు..! కారణం ఇదే..
AP EAMCET 2024

Updated on: Mar 20, 2024 | 11:54 AM

కాకినాడ, మార్చి 13: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈఏపీసెట్‌) 2024 పరీక్షకు మార్చి 12 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏపీఈఏపీసెట్‌ పరీక్షలు మే 13 నుంచి మే 19వ వరకు నిర్వహించనున్నట్లు తొలుత ప్రకటించిన నోటిఫికేషన్‌లో జేఎన్‌టీయూ కాకినాడ పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ప్రకటించిన ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం ఆ తేదీల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

దీంతో ఏపీఈఏపీసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసి మే 15 నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లోనూ మార్పులు చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అలాగే ఏపీ పీజీసెట్‌ 2024 పరీక్ష జూన్‌ 3వ తేదీ నుంచి ప్రారంభంకావల్సి ఉంది. అయితే జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంది. దీంతో ఈ పరీక్ష తేదీని కూడా మార్పు చేసి మరికొన్ని రోజులు ముందుకు వేయాలని భావిస్తోంది.

మార్చి 22తో ముగుస్తోన్న బీహెచ్‌ఎంసీటీ ఫీజు గడువు

తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరిగే బ్యాచిలర్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్ అండ్‌ కన్ఫెక్షనరీ టెక్నాలజీ (BHMCT) సెమిస్టర్‌ పరీక్షల ఫీజు గడువు మార్చి 22వ తేదీతో ముగుస్తోంది. 2, 4, 6 సెమిస్టర్ల సబీసీఎస్‌ గడువు శుక్రవారంతో ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా శ్రీరంగప్రసాద్‌ ఓ ప్రకటలో తెలిపారు. మార్చి 27వ తేదీ వరకు ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.