AP EAPCET 2022: మరికాసేపట్లో ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

AP EAPCET 2022: ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలు మరికాసేపట్లో విడుదలకానున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని హోటల్‌ లెమన్‌...

AP EAPCET 2022: మరికాసేపట్లో ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
10th supplementary result 2022

Updated on: Jul 26, 2022 | 9:42 AM

AP EAPCET 2022: ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలు మరికాసేపట్లో విడుదలకానున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని హోటల్‌ లెమన్‌ ట్రీ ప్రీమియర్‌లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజల్ట్స్‌ చేసుకోవచ్చు.

ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలను జులై 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 3,84,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల అనంతరం నిర్వహించే బీఈ, బీటెక్‌, బీటెక్‌ (బయోటెక్‌), బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్‌ వెయటేజీ రద్దు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి (APSCHE) ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఏపీ ఈఏపీసెట్‌ 2022లో సాధించిన ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఏపీలో 120, తెలంగాణలో 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక ఈసారి ఇంటర్మీడియెట్‌ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..