AP CSPG Recruitment 2023: ఏడాదికి రూ.36 లక్షల జీతంతో రాత పరీక్షలేకుండా ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..

|

Jan 09, 2023 | 1:11 PM

ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌ అండ్‌ గవర్నెన్స్‌.. 17 ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

AP CSPG Recruitment 2023: ఏడాదికి రూ.36 లక్షల జీతంతో రాత పరీక్షలేకుండా ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..
Andhra Pradesh
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌ అండ్‌ గవర్నెన్స్‌.. 17 ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ/ సీఏ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ సంబంధిత స్పెషలైజేషన్‌లో లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు జనవరి 17, 2023వ తేదీలోపు కింది ఈమెయిల్‌ ఐడీకి దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వూకి ఎంపికైన వారి వివరాలు జనవరి 27న ప్రకటిస్తారు. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఇంటర్వూ నిర్వహిస్తారు. తుది మెరిట్‌లిస్ట్ ఫిబ్రవరి 17న విడుదలవుతుంది. ఎంపికై వారికి ఏడాదికి రూ.5.4 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.