India Post GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 మూడో లిస్టు ఫలితాలు విడుదల.. మే 22న ధ్రువపత్రాల పరిశీలన

|

May 14, 2023 | 12:29 PM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న దాదాపు 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ఇండియా పోస్ట్‌ నియామకాల చేపడుతోన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో..

India Post GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 మూడో లిస్టు ఫలితాలు విడుదల.. మే 22న ధ్రువపత్రాల పరిశీలన
India Post GDS Merit List-3
Follow us on

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న దాదాపు 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ఇండియా పోస్ట్‌ నియామకాల చేపడుతోన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి మూడో జాబితాను పోస్టల్ శాఖ తాజాగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి మూడో జాబితాను పోస్టల్ శాఖ శనివారం (మే 13) విడుదల చేసింది. అర్హులైన వారి వివరాలను కింది లింక్‌లలో చెక్‌ చేసుకోవచ్చు.

పదో తరగతిలో సాధించిన మార్కులు/గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. మార్కుల ప్రాధాన్యం, రిజర్వేషన్‌ అనుసరించి ఎంపికైన అభ్యర్ధులకు ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/పోస్టు ద్వారా సమాచారం అందజేస్తారు. ఎంపికైన అభ్యర్థులు మే 22వ తేదీలోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ దశలో కూడా అర్హత సాధించిన వారికి మాత్రమే నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ సెకండ్ మెరిట్ (లిస్ట్-3) ఫలితాల-2023 కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ జీడీఎస్ సెకండ్ మెరిట్ (లిస్ట్‌-3) ఫలితాల-2023 కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.