AP 10th Class Results 2022: వారంలోగా విడుదలకానున్న ఏపీ టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. అలా చేస్తే కఠిన చర్యలు!

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల ఫలితాలు వారంలోగా విడుదల కానున్నాయి. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఫలితాలు రెండు మూడు రోజుల్లో ..

AP 10th Class Results 2022: వారంలోగా విడుదలకానున్న ఏపీ టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. అలా చేస్తే కఠిన చర్యలు!
Ap 10th Class Results

Updated on: Jun 02, 2022 | 7:02 PM

AP 10th Class Results 2022: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల ఫలితాలు వారంలోగా విడుదల కానున్నాయి. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఫలితాలు రెండు మూడు రోజుల్లో విడుదలవుతాయని సమాచారం. కాగా ఈ సారి విడుదలయ్యే పదో తరగతి ఫలితాల్లో కూడా గ్రేడులకు బదులు విద్యార్థులకు వచ్చిన మార్కులు మాత్రమే ప్రకటించనున్నారు. ఐతే ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల ప్రకటన అనంతరం ప్రైవేట్ విద్యాసంస్థలు, స్కూళ్లు తమ విద్యార్థులకు మొదటి ర్యాంకులు వచ్చాయంటూ ప్రకటనలు ఇవ్వకూడదంటూ ప్రభుత్వం బుధవారం (జూన్‌ 1) ఉత్తర్వులు జారీచేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఏ పాఠశాలైనా తమ విద్యార్థులకు పలానా ర్యాంకు వచ్చిందంటూ ప్రకటిస్తే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని విద్యాశాఖ తెల్పింది.

మరోవైపు తెలంగాణలో ముగిసిన టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు..నేటి నుంచి మూల్యాంకనం ప్రారంభం..
తెలంగాణ పదో తరగతి పరీక్షలు బుధవారం (జూన్‌ 1)తో మగిశాయి. నేటి నుంచి జూన్‌ 11 వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు. కరోనా మహమ్మారి దృష్ట్యా కుదించిన సిలబస్‌తో విద్యార్థులకు తరగతులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి టెన్త్‌ పరీక్షలను కేవలం 6 పేపర్లకే నిర్వహించారు. మూల్యాంకనం అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.