ANGRAU Guntur Field Supervisor Recruitment 2022: ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధికి చెందిన గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU Guntur).. ఒప్పంద ప్రాతిపదికన 27 ఫీల్డ్ సూపర్‌వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల (Field Supervisor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, అగ్రికల్చర్‌లో బీఎస్సీ, అగ్రికల్చర్/అగ్రికల్చరల్ ఎకనామిక్స్ విభాగాల్లో ఎంఎస్సీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు ఖచ్చితంగా 35 నుంచి 40 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా సెస్టెంబర్ 7, 2022వ తేదీలోపు కింది ఈ మెయిల్ ఐడీకి తమ దరఖాస్తులను పంపించవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.19,500ల నుంచి రూ.54,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ మెయిల్ ఐడీ: deanresearch@admin.nitdgp.ac.in
అడ్రస్: RARS, Lam, Guntur
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.