AP 10th Supply Results 2025: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఛాన్స్!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి 2025 అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. అలాగే ఓపెన్ స్కూల్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఇదే తేదీల్లో అంటే మే 19 నుంచి 24 వరకు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలను గురువారం (జూన్‌ 12) సాయంత్రం పాఠశాల విద్యాశాఖ విడుదల..

AP 10th Supply Results 2025: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఛాన్స్!
10th Supply Results

Updated on: Jun 13, 2025 | 6:18 AM

అమరావతి, జూన్‌ 13: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి 2025 అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. అలాగే ఓపెన్ స్కూల్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఇదే తేదీల్లో అంటే మే 19 నుంచి 24 వరకు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలను గురువారం (జూన్‌ 12) సాయంత్రం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రోల్‌ నంబర్‌ నమోదు చేసి ఫలితాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు మొత్తంగా 1,23,477మంది విద్యార్థులు హాజరయ్యారు. తాజా ఫలితాల్లో 76.14 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో అబ్బాయిలు 73.55 శాతం, అమ్మాయిలు 80.10 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇక పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి జూన్‌ 13 నుంచి 19వ తేదీ వరకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్ధులు శుక్రవారం (జూన్‌ 13) నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాలని, ఇక రీవెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.