AP 10th Supply Hall Tickets 2024: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి!

|

May 15, 2024 | 7:32 AM

ఆంధప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2024 పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ రోజు విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్ టికెట్లను టెన్త్ బోర్డు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆయా పాఠశాలల హెచ్ఎంల లాగిన్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్‌సీ బోర్డు సూచించింది. మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు..

AP 10th Supply Hall Tickets 2024: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి!
AP 10th Supply Hall Tickets
Follow us on

విజయవాడ, మే 15: ఆంధప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2024 పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ రోజు విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్ టికెట్లను టెన్త్ బోర్డు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆయా పాఠశాలల హెచ్ఎంల లాగిన్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్‌సీ బోర్డు సూచించింది. మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే బోర్డు విడుదల చేసింది.

ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల టైం టేబుల్‌ ఇదే

  • మే 24, 2024: ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 1
  • మే 25, 2024: సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
  • మే 27, 2024: ఇంగ్లిష్‌
  • మే 28, 2024: మ్యాథమెటిక్స్‌
  • మే 29, 2024: ఫిజికల్ సైన్స్
  • మే 30, 2024: జీవ శాస్త్రం
  • మే 31, 2024: సోషల్ స్టడీస్‌
  • జూన్ 1, 2024: ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ II, OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I
  • జూన్ 3, 2024: OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ II, SSC ఒకేషనల్ కోర్సు

ఆంధ్రప్రదేశ్‌లోని 10వ తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు కూడా సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు తదుపరి దశకు ప్రమోట్ అవుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.