AP HMFW Job: పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

|

Jan 09, 2025 | 9:43 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని హెల్త్‌ మెడికల్‌ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హతలు కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా విద్యార్హతల ఆధారంగా..

AP HMFW Job: పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
AP HMFW Job
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ మెడికల్‌ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ (HMFW) తూర్పు గోదావరి జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌-2, ఎఫ్ఎన్‌ఓ, ఎస్‌ఏడబ్ల్యూ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 61 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు జనవరి 20, 2025వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు.

పోస్టుల వివరాలు..

  • ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల సంఖ్య: 03
  • ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ (FNO) పోస్టుల సంఖ్య: 20
  • శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ (SAW) పోస్టుల సంఖ్య: 38

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ లేదా మాస్టర్‌ డిగ్రీ (మెడికల్ ల్యాబ్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఫస్ట్ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 52 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

ఆసక్తి కలిగిన వారు జనవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.500 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.200 చొప్పున చెల్లించాలి. ఈ పోస్టులకు అభ్యర్ధుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం విద్యార్హతల్లో సాధించిన మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.