Mega DSC 2025 Merit List: మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్‌పై విద్యాశాఖ యూటర్న్.. రేపటికి వాయిదా!
మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటీవల స్కోర్ కార్డులను విడుదల చేసిన విషయం తెలిసిందే. టెట్ మార్కులకు సంబంధించి అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం సవరించిన టెట్ మార్కులతో మరోమారు స్కోర్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. అయితే బుధవారం..

అమరావతి, ఆగస్ట్ 21: కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటీవల స్కోర్ కార్డులను విడుదల చేసిన విషయం తెలిసిందే. టెట్ మార్కులకు సంబంధించి అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం సవరించిన టెట్ మార్కులతో మరోమారు స్కోర్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. అయితే బుధవారం (ఆగస్ట్ 20) మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని తొలుత ప్రకటించిన విద్యాశాఖ ఆ తర్వాత యూటర్న్ తీసుకుంది. అభ్యర్థులకు టెట్ మార్కుల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే గడువు ముగిసింది. దీంతో ఆగస్ట్ 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
ఆంధ్రధ్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య లో అనేక సంసక రణలకు శ్రీకారం చుట్టింది. విద్యర్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రధ్రదేశ్ ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యయ ఉద్యోగాల నియామకాలకు మెగా డీఎస్సీ నిర్వహించింది. ఇప్పటికే అభ్యర్ధుల ఫలితాలు వెల్లడించిన విద్యాశాఖ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నేరుగా 1:1 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేసి, జాబితా విడుదల చేయనుంది. ఈ జాబితాను రేపు (ఆగస్ట్ 22) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.
మరోవైపు మెగా డీఎస్సీలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించేందుకు జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 20న శిక్షణ పూర్తి చేసింది. మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించినందున ఈ మార్పు చేసింది. దీంతో సర్టిఫికెట్లను పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం విద్యాశాఖ విడుదల చేయనుంది. సర్టిఫికెట్ల పరిశీలనకు 50 మంది అభ్యర్థులకు ఇద్దరు అధికారుల చొప్పున కేటాయించనుంది. అలాగే ఎంఈవో స్థాయికి తగ్గకుండా సబ్జెక్టు నిపుణులు ఒకరు, కంప్యూటర్ ఆపరేటర్ మరొకర్ని టీమ్‌గా నియమించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




